Share News

Mla Kandikunta చెల్లికి సమాధానం చెప్పి.. రా..!

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:22 AM

చెల్లి సునీతకు సమాధానం చెప్పి.. ఆ తరువాత వైసీపీ అధ్యక్షుడు జగనమ్మోహనరెడ్డి రామగిరికి రావాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ సవాల్‌ విసిరారు. స్థానిక అర్‌అండ్‌బీ బంగ్లాలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Mla Kandikunta చెల్లికి సమాధానం చెప్పి.. రా..!
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌

జగనకు కందికుంట సవాల్‌

కదిరి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): చెల్లి సునీతకు సమాధానం చెప్పి.. ఆ తరువాత వైసీపీ అధ్యక్షుడు జగనమ్మోహనరెడ్డి రామగిరికి రావాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ సవాల్‌ విసిరారు. స్థానిక అర్‌అండ్‌బీ బంగ్లాలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రామగిరిలో వ్యక్తిగత తగాదాల నేపథ్యంలో జరిగిన హత్యను కుల, రాజకీయ హత్యగా పేర్కొనడం జగన కుట్రపూరితతనానికి నిదర్శనమన్నారు. రామగిరికి వచ్చే ముందు చిన్నాన్న వివేకానందరెడ్డి ఎలా చనిపోయాడో ఆయన కూతురు సునీతకు సమాధానం చెప్పాలన్నారు. జగనకు మానవత్వం ఉంటే మొదట వివేకానందరెడ్డి హత్యను తేల్చాలని డిమాండ్‌ చేసేవాడని అన్నారు. ఆ కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారనీ, వాటి వెనుక జగన హస్తం ఉన్నట్లు తనకు అనుమానం ఉందని ఆరోపించారు. సునీతకు కూడా దీనిపై అనుమానం ఉందన్నారు. ప్రొద్దుటూరులో చేనేత వర్గానికి చెందిన వ్యక్తిని హత్య చేసినపుడు, చంద్రయ్యను చంపినపుడు హత్యారాజకీయాలు జగనకు గుర్తు రాలేదా అని కందికుంట నిలదీశారు. వీటన్నింటికి సమాధానం చెప్పి, రామగిరికి రావాలని కోరారు. సమావేశంలో టీడీపీ నాయకులు డైమండ్‌ ఇర్ఫాన, కొమ్మినేని గంగయ్యనాయుడు, కొయ్య రాజేంద్రనాయుడు, కలాం పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 12:22 AM