Share News

Mla Kandi Kunta కదిరి అభివృద్ధికి లోకేశ హామీ

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:49 PM

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున హాజరై, పట్టువసా్త్రలు సమర్పించినందుకు మంత్రి నారా లోకేశకు పట్టణ ప్రజల తరఫున ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ధన్యవాదాలు తెలిపారు. తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Mla Kandi Kunta కదిరి అభివృద్ధికి లోకేశ హామీ
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట

శ్రీవారికి పట్టువసా్త్రలు సమర్పించినందుకు ధన్యవాదాలు

ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌

కదిరి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున హాజరై, పట్టువసా్త్రలు సమర్పించినందుకు మంత్రి నారా లోకేశకు పట్టణ ప్రజల తరఫున ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ధన్యవాదాలు తెలిపారు. తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్నివర్గాల సహకారంతో స్వామివారి కల్యాణోత్సవం విజయవంతమైందని అన్నారు. ఖాద్రీశుడి కల్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టువసా్త్రలను సమర్పించేలా అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో తెచ్చిందని గుర్తు చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా మంత్రి నారా లోకేశ స్వామివారి వద్ద వసా్త్రలు సమర్పించి, సంకల్పం తీసుకున్నారని తెలిపారు. కదిరి అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కదిరిలో టెంపుల్‌ టూరిజం సర్క్యూట్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. దీనికి అవసరమైన నిధులను సమకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. కదిరి మీదుగా గ్రీనఫీల్డు హైవే, ముద్దనూరు, కోడూరు నాలుగులైన్ల రహదారి సిద్ధమవుతున్నాయని, పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని మంత్రి లోకేశను కోరామని తెలిపారు. హంద్రీనీవా ద్వారా అన్ని చెరువులకు నీరు అందిస్తామని అన్నారు. గాండ్లపెంటకు హంద్రీనీవా నీరు అందుతుందని అన్నారు. జగనకు అజెండా ఏమీ లేక ఫీజు పోరు కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు. సమావేశంలో టీడీపీ రూరల్‌ మండల కన్వీనర్‌ చెన్నకేశువులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 11:49 PM