ఘనంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జన్మదినం
ABN , Publish Date - Oct 16 , 2025 | 11:16 PM
గోవాలోని ఓ రిసార్టులో గురువారం సాయంత్రం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం జన్మదిన వేడుకలను స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
గుంతకల్లు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): గోవాలోని ఓ రిసార్టులో గురువారం సాయంత్రం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం జన్మదిన వేడుకలను స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తినిపించారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు గుమ్మనూరు నారాయణస్వామి, గుమ్మనూరు శ్రీనివాసులు, టీడీపీ మండల అధ్యక్షుడు రామన్నచౌదరి, న్యాయవాది బీఎస్ కృష్ణారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు తలారి మస్తానప్ప, మాజీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఫజులు, నాయకులు నందీశ్వర్, యుఽగంధర్ పాల్గొన్నారు.