Share News

MLA Daggubati ఇది మేలు చేసే ప్రభుత్వం

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:14 AM

కూటమి ప్రభుత్వం అంటే.. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వమని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. సోమవారం సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌ కార్యక్రమంలో భాగంగా భారీగా స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు.

MLA Daggubati ఇది మేలు చేసే ప్రభుత్వం
ర్యాలీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌

హామీ ఇవ్వని జీఎస్టీని తగ్గించాం: ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం క్రైం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అంటే.. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వమని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. సోమవారం సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌ కార్యక్రమంలో భాగంగా భారీగా స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఎ్‌సబీఎన కళాశాల వద్ద ఎమ్మెల్యే దగ్గుపాటి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు జీఎస్టీ తగ్గిస్తామని కూటమి హామీ ఇవ్వలేదన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కొనియాడారు. ప్రధాని మోదీ నిర్ణయానికి సీఎం చంద్రబాబు మద్దతు పలికారని అన్నారు. జీఎస్టీ తగ్గించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కూడా రూ. 8 వేల కోట్ల భారం పడుతుందన్నారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత కార్పొరేషన చైర్‌పర్సన స్వప్న, నగరపాలక సంస్థ కమిషనర్‌ బాలస్వామి, కార్మికశాఖ డీసీ లక్ష్మీనరసయ్య, మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ పావని, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అసోసియేషన కార్యదర్శి రంగారెడ్డి, కార్పొరేషన్ల డైరెక్టర్లు పోతుల లక్ష్మీనరసింహ, పీఎల్‌ఎన మూర్తి, బొమ్మినేని శివ, ఇమామ్‌ హుస్సేన, కార్పొరేటర్లు జనబలం బాబా, బాలాంజనేయులు, టీడీపీ నాయకులు సరిపూటి రమణ, సుధాకర్‌ యాదవ్‌, రాజారావు, బాలకృష్ణ, ఫిరోజ్‌ అహ్మద్‌, తేజస్విని, భవానీ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 12:14 AM