MLA BalaKrishna జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్రంలో పండుగ
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:10 AM
జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్రం పండగ జరుపుకుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. జీఎస్టీ 2.0 పేరిట హిందూపురం చిన్నమార్కెట్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సోమవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
హిందూపురంలో జీఎస్టీ 2.0పై ర్యాలీ
హిందూపురం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్రం పండగ జరుపుకుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. జీఎస్టీ 2.0 పేరిట హిందూపురం చిన్నమార్కెట్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సోమవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. వేలాది మంది మహిళలు, విద్యార్థులు ర్యాలీలో భాగస్వాములయ్యారు. అంతకు మునుపు బట్టల దుకాణం, కిరాణం దుకాణం, ఐరన మార్ట్‌లోకి వెళ్లి జీఎస్టీ తగ్గింపు తరువాత వ్యాపారులకు, వినియోగదారులకు మేలు జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ సర్కిల్‌లో ఉన్న ఓ మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపు ఫలాల గురించి ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, జీఎస్టీ తగ్గించడంతో అందరికంటే ఎక్కువగా రోగులకు మేలు జరుగుతోందని అన్నారు. క్యాన్సర్ ఆసుపత్రి చైర్మనగా.. క్యాన్సర్ మందులపై జీఎస్టీని తొలగించడాన్ని హర్షిస్తున్నానన్నారు. గతంలో పలురకాల పన్నులు ఉండేవని, ఎన్డీఏ ప్రభుత్వం వాటన్నింటిని ఒకే గూటికి తెచ్చి, జీఎస్టీగా మార్చిందని అన్నారు. జీఎస్టీ వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, ఆ ఫలాలను ప్రస్తుతం ప్రజలకు పంచుతున్నారని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో రాషా్ట్రనికి రూ.8 వేల కోట్ల నష్టం జరుగుతోందని, అయినా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతోందని అన్నారు.
బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలి..
హిందూపురం మండలం కె బసవనపల్లి వద్ద తారు రోడ్డును ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన తిరిగి వెళ్లేందుకు వాహనం ఎక్కుతుండగా.. అభిమానులు ‘బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి’ అని ప్లకార్డులు ప్రదర్శించారు. పార్టీకి 40 ఏళ్లుగా సేవ చేస్తున్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాటిని చూసిన బాలకృష్ణ.. నవ్వుతూ వాహనమెక్కి ముందుకు కదిలారు.