ఫలించిన ఎమ్మెల్యే అమిలినేని కృషి
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:47 PM
అనంతపురంలో కూటమి పార్టీలు సమష్టిగా బుధవారం నిర్వహించిన ‘సూపర్ సిక్స్ - సూపర్ హిట్’ సభ గ్రాండ్ సక్సెస్ కావడంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కీలకపాత్ర పోషించాడు
కళ్యాణదుర్గం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో కూటమి పార్టీలు సమష్టిగా బుధవారం నిర్వహించిన ‘సూపర్ సిక్స్ - సూపర్ హిట్’ సభ గ్రాండ్ సక్సెస్ కావడంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కీలకపాత్ర పోషించాడు. ప్రధాన సభ ఏర్పాటు నుంచి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల నుంచి తరలివచ్చే అభిమానులకు ఎలాంటి అసౌకర్యాలూ కలగకుండా అన్ని ఏర్పాట్లను కల్పించారు. కళ్యాణదుర్గం పట్టణంతో పాటు అనంతపురం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు బ్యానర్లు, ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ప్రతి గ్రామం నుంచి ప్రత్యేక బస్సులు సీఎం సభకు ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నుంచి సుమారు 400 బస్సుల్లో అభిమానులు ఆ సభకు తరలివెళ్లారు. వారందరికీ భోజన, తాగునీటి తదితర సౌకర్యాలు కల్పించారు. సీఎం సభకు తరలివచ్చిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సభలో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి తరలివచ్చిన అభిమానులే అధిక సంఖ్యలో కనిపించారని, వారు చూపిన అభిమానం మరువలేనిదని ఎమ్మెల్యే అన్నారు. ఇదే ఉత్సాహంతో పార్టీని మరింత బలోపేతం చేసేదిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.