Share News

Mionister Savita అమ్మాయిలకు అండగా ఉంటాం

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:41 AM

తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థినుల చదువుకు అండగా ఉంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భరోసా ఇచ్చారు. పరిగి మండల కేంద్రంలోని భజంత్రీ గోపాల్‌ రెండు రోజుల క్రితం మృతిచెందారు. ఎనిమిదేళ్ల క్రితం అతడి భార్య మృతిచెందారు. దీంతో ఇద్దరు కుమార్తెలు పెద్ద దిక్కును కోల్పోయారు.

Mionister Savita అమ్మాయిలకు అండగా ఉంటాం
అమ్మాయిలతో మాట్లాడుతున్న మంత్రి సవిత

బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థినులకు ఆర్థికసాయం

పరిగి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థినుల చదువుకు అండగా ఉంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భరోసా ఇచ్చారు. పరిగి మండల కేంద్రంలోని భజంత్రీ గోపాల్‌ రెండు రోజుల క్రితం మృతిచెందారు. ఎనిమిదేళ్ల క్రితం అతడి భార్య మృతిచెందారు. దీంతో ఇద్దరు కుమార్తెలు పెద్ద దిక్కును కోల్పోయారు. విషయం తెలుసుకున్న మంత్రి సోమవారం మృతుడి ఇంటి వద్దకు చేరుకున్నారు. గోపాల్‌ కూతురు అక్షిత హిందూపురంలోని సువర్ణభారతి జూనియర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం బైపీసీలో 440కి గాను 436 మార్కులు సాధించినట్లు చెప్పారు. మరో అమ్మాయి వందన పరిగి కేజీబీవీలో 9వతరగతి చదువుతోంది. తల్లిదండ్రులను కోల్పోయిన బాలికల చదువులు ముందుకు సాగించాలని మంత్రి లోకేష్‌ స్వయంగా తనను పంపించారని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం పిల్లల బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రూ.25వేలు ఆర్థికసాయం చేశారు. సువర్ణభారతి సంస్థల యజమాని నీలకంఠారెడ్డితో మంత్రి మాట్లాడి.. అక్షితకు సంబంధించి ఫీజు బకాయిలు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Updated Date - Dec 09 , 2025 | 12:41 AM