Minister Savita గ్రామాల్లో అభివృద్ధి బాటలు: మంత్రి సవిత
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:24 AM
ఏళ్లుగా మట్టిరోడ్లే ఉన్న గ్రామాల్లో సైతం సిమెంటు రోడ్లు వేస్తున్నామని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పెనుకొండ, రొద్దం మండలాల్లో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. పెనుకొండ మండలం నాగలూరు గ్రామంలో జలజీవన మిషన కింద నూతన బోరుబావికి భూమిపూజ చేశారు.

పెనుకొండ రూరల్, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): ఏళ్లుగా మట్టిరోడ్లే ఉన్న గ్రామాల్లో సైతం సిమెంటు రోడ్లు వేస్తున్నామని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పెనుకొండ, రొద్దం మండలాల్లో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. పెనుకొండ మండలం నాగలూరు గ్రామంలో జలజీవన మిషన కింద నూతన బోరుబావికి భూమిపూజ చేశారు. అనంతరం రూ.1.05 కోట్లతో పూర్తయిన సీసీ రోడ్డును ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆశలు నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల ముం దు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, ఏళ్లుగా పెం డింగ్‌లో ఉన్న గ్రామీణ రహదారులను సైతం నిర్మిస్తున్నామన్నా రు. త్వరలోనే పెనుకొండ, రొద్దం, తదితర ప్రాంతాల్లో మహిళల ఉపాధి కోసం గార్మెంట్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు. స్థల పరిశీలన చేపడుతున్నామన్నారు. అనంతరం రొద్దం మండలంలో పెన్నానదిపై రూ.2.8 కోట్లతో వంతెన నిర్మాణానికి భూమిపూజ చేశారు. డీఆర్ కొట్టాల నుంచి దొడగట్ట వరకు రూ.1.30కోట్లతో సీసీ రోడ్డుకు భూమిపూజ చేశారు. తురకలాపట్నం గ్రామ చెరువులో జలహారతి ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ జడ్పీటీసీ నారాయణస్వామి, యాదవ కార్పొరేషన డైరెక్టర్ కేశవయ్య, మండల కన్వీనర్ సిద్దయ్య పాల్గొన్నారు.