Minister వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:59 AM
వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం బాగుంటుందని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. సోమవారం స్థానిక శిల్పారామంలో స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేశారు.
పర్యావరణాన్ని కాపాడుకోవాలి
వైద్య మంత్రి సత్యకుమార్ యాదవ్
47 మందికి స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం
పుట్టపర్తి టౌన/రూరల్, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం బాగుంటుందని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. సోమవారం స్థానిక శిల్పారామంలో స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అనారోగ్యం బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని తెలిపారు. పచ్చదనాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. తల్లిపేరున మొక్కను నాటి పరిరక్షించాలన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. అందరి భాగస్వామ్యంతో జిల్లాకు రెండు రాష్ట్ర స్థాయి, 47 జిల్లాస్థాయి అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రజలు తడి, పొడిచెత్త వేర్వేరుగా చేసి చెత్తదిబ్బలో బాధ్యతగా వేయాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ప్లాస్టిక్ వాడకాన్ని మాని పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వచ్ఛతను పాటించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత పరిశుభత్రతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా అత్యంత ముఖ్యం అన్నారు. అంతకు ముందు మంత్రి సత్యకుమార్ ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన వైద్యఆరోగ్య స్టాల్‌ను సందర్శించారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఉత్తమ సేవకులకు మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రశంసాపత్రాలు, మెమెంటోలను అందచేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన డైరెక్టర్లు పర్వీనబాను, మంజునాథ్‌రెడ్డి, ప్రజాప్రలానిధులు, అధికారులు పాల్గొన్నారు.