Share News

Mini Mahanadu మినీమహానాడు స్థల పరిశీలన

ABN , Publish Date - May 22 , 2025 | 12:17 AM

జిల్లా కేంద్రంలో శనివారం తెలుగుదేశం పార్టీ మినీమహనాడు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు స్థలాలను టీడీపీ ప్రముఖులు బుధవారం పరిశీలించారు.

Mini Mahanadu మినీమహానాడు స్థల పరిశీలన
స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి, ఎమ్మెల్యే

పుట్టపర్తిరూరల్‌, మే 21(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో శనివారం తెలుగుదేశం పార్టీ మినీమహనాడు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు స్థలాలను టీడీపీ ప్రముఖులు బుధవారం పరిశీలించారు. ఇందులో బీసీ సంక్షేమ శాఖా మంత్రి సవిత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వడ్డే అంజినప్ప, కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి ఉన్నారు. వీరు మామిళ్ళకుంట కూడలిలో ఉన్న ఏపీఐఐసీలోని స్థలాన్ని , ప్రశాంతిగ్రామ్‌ పోలీసుపెరేడ్‌ గ్రౌండును పరిశీలించారు. వారి వెంట జిల్లా కార్యదర్శి సామకోటి అదినారాయణ, కన్వీనర్లు, మాజీ సర్పంచ చంద్రశేఖర్‌ ఉన్నారు.

Updated Date - May 22 , 2025 | 12:17 AM