సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN , Publish Date - Oct 16 , 2025 | 11:17 PM
వీఓఏలకు మూడు సంవత్సరాల కాలపరిమితిని రద్దు చేసినందుకు ప్రభుత్వానికి ఆ ఉద్యోగులు ధ న్యవాదాలు తెలిపారు.
వజ్రకరూరు (ఉరవకొండ), అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): వీఓఏలకు మూడు సంవత్సరాల కాలపరిమితిని రద్దు చేసినందుకు ప్రభుత్వానికి ఆ ఉద్యోగులు ధ న్యవాదాలు తెలిపారు. అందులో భాగంగా వజ్రకరూరు మండల సమైక్య కార్యాలయంలో చంద్రోదయ మండల సమాఖ్య ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చిత్రపటాలకు గురువారం క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఏ లలిత, సీసీలు వెంకటేష్, శ్రీనివాసులు, మండల సమాఖ్య అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి రత్నమ్మ పాల్గొన్నారు.