meeting: చలో విజయవాడను జయప్రదం చేయండి
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:22 AM
డిమాండ్ల సాధన కోసం అక్టోబరు 7న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన హృదయరాజు పిలుపునిచ్చారు. చలో విజయవాడ పోరుబాట సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం అనంతపురం వచ్చారు. ఉపాధ్యాయ భవనలో జిల్లా ఫ్యాప్టో(ఉపాధ్యాయసంఘాలు) నేతలతో సమావేశం అయ్యారు.
ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన హృదయరాజు
అనంతపురం విద్య, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): డిమాండ్ల సాధన కోసం అక్టోబరు 7న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన హృదయరాజు పిలుపునిచ్చారు. చలో విజయవాడ పోరుబాట సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం అనంతపురం వచ్చారు. ఉపాధ్యాయ భవనలో జిల్లా ఫ్యాప్టో(ఉపాధ్యాయసంఘాలు) నేతలతో సమావేశం అయ్యారు. ఈసందర్భంగా హృదయరాజు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. గత ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయుల అనేక హక్కులను కాలరాసిందని మండిపడ్డారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగపూట కూడా ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలలో కడుపు నింపడంలేదన్నారు. ఈ పరిస్థితి మారాలంటే పోరుబాట తప్పదని పేర్కొన్నారు. సమావేశంలో ఫ్యాప్టోనేతలు శ్రీనివాసనాయక్, పురుషోత్తం, రమణారెడ్డి, సిరాజుద్దీన, రాయల్‌వెంకటేష్, కులశేఖరరెడ్డి, లింగమయ్య, వెంకటరత్నం, గోపాల్‌రెడ్డి, సూర్యుడు, లింగమూర్తి, వెంకటసుబ్బయ్య, రవీంద్ర, రఫీ, వెంకటరెడ్డి, రామాంజినేయులు, సరిత, సూర్యనారాయణ, లక్ష్మీనారాయణ, నాగరాజు, ఖాన, జార్జ్ పాల్గొన్నారు.