Share News

ఉంతకల్లులో వైద్య శిబిరం ఏర్పాటు

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:09 AM

మండలంలోని ఉంతకల్లు ఆర్డీటీ కాలనీలో పలువురు చిన్నారులు జ్వరాల బారిన పడ్డారు. దీనిపై ఆంధ్రజ్యోతి బుధవారం ఓ కథనాన్ని ప్రచురించింది.

ఉంతకల్లులో వైద్య శిబిరం ఏర్పాటు
చిన్నారులను పరీక్షిస్తున్న వైద్య సిబ్బంది

బొమ్మనహాళ్‌, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉంతకల్లు ఆర్డీటీ కాలనీలో పలువురు చిన్నారులు జ్వరాల బారిన పడ్డారు. దీనిపై ఆంధ్రజ్యోతి బుధవారం ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో బొమ్మనహాళ్‌ ప్రాథమిక ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆ గ్రామంలో బుధవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జ్వరంతో బాధపడుతున్న చిన్నారుల రక్త నమూనాలను సేకరించారు. మాత్రలను పంపిణీ చేశారు.

Updated Date - Sep 04 , 2025 | 12:09 AM