Share News

గడేకల్లులో వైద్య శిబిరం

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:00 AM

మండలంలోని గడేకల్లులో అనేక మంది జ్వరాల బారిన పడ్డారు. దీంతో గడేకల్లులో విషజ్వరాలు అనే శీర్షికతో ఆదివారం ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. స్పందించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌.. గడేకల్లులో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.

 గడేకల్లులో వైద్య శిబిరం
గడేకల్లులో పర్యటిస్తున్న డీఎంహెచఓ

విడపనకల్లు, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని గడేకల్లులో అనేక మంది జ్వరాల బారిన పడ్డారు. దీంతో గడేకల్లులో విషజ్వరాలు అనే శీర్షికతో ఆదివారం ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. స్పందించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌.. గడేకల్లులో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. పెద్ద కొట్టాలపల్లి వైద్యుడు జయకుమార్‌ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో సోమవారం వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. డీఎంహెచఓ ఈబీ దేవి, జిల్లా ప్రోగ్రాం వైద్యాధికారి నారాయణస్వామి గడేకల్లు గ్రామం చేరుకొని.. వీధులను పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. గ్రామలో పారిశుధ్య పనులు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి సోమయ్య, ఈఓఆర్డీ సత్యబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మురికి కాలువలపై బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు.

Updated Date - Sep 16 , 2025 | 12:00 AM