మార్కెట్ నిర్మాణానికి చర్యలు
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:06 AM
పట్టణంలోని గవిమఠం ఆవరణంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటులో భాగంగా ఆ స్థలా న్ని తహసీల్దారు మహబూబ్‌బాషా, ఎంపీడీవో రవి ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు.
ఉరవకొండ, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని గవిమఠం ఆవరణంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటులో భాగంగా ఆ స్థలా న్ని తహసీల్దారు మహబూబ్‌బాషా, ఎంపీడీవో రవి ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఆక్రమణలో ఉన్న షాపులను గడువులోగా తొలగించాలని, అభివృద్ధికి సహకరించాలని దుకాణాదారులను కో రారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ రత్నాకర్, డిప్యూటీ ఎంపీడీవోలు సతీష్, మహ్మద్ రఫీ, గవిమఠం సిబ్బంది పాల్గొన్నారు.