Share News

మార్కెట్‌ నిర్మాణానికి చర్యలు

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:22 AM

స్థానిక గవిమఠం ఆవరణంలో మార్కెట్‌ నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. 2004లో కూరగాయల మార్కెట్‌ ఏర్పాటుకు పంచాయతీ క్వాటర్స్‌లో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు.

మార్కెట్‌ నిర్మాణానికి చర్యలు
స్థలాన్ని చదును చేస్తున్న సిబ్బంది

ఉరవకొండ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): స్థానిక గవిమఠం ఆవరణంలో మార్కెట్‌ నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. 2004లో కూరగాయల మార్కెట్‌ ఏర్పాటుకు పంచాయతీ క్వాటర్స్‌లో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. 21ఏళ్లు గడుస్తున్నా మార్కెట్‌ నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. దీంతో కూరగాయలు, ఆకుకూరల వ్యాపారులు టవర్‌క్లాక్‌ కూడలిలో రోడ్డు పైనే వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు కలుగుతుండడంతో మంత్రి కేశవ్‌ ప్రత్యేక చొరవ తీసుకుని, మార్కెట్‌ను తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నెల 8న గవిమఠం ఆవరణంలో మార్కెట్‌ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. పంచాయతీ, గవిమఠం అధికారులు మార్కెట్‌ నిర్మాణంలో భాగంగా ఆ స్థలాన్ని చదును చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Updated Date - Oct 18 , 2025 | 12:22 AM