Share News

వైభవంగా మారెమ్మ జాతర

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:47 PM

మండలంలోని ఉప్పరహాళ్‌క్రా్‌సలో మారెమ్మ జాతరను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో మంగళవారం నిర్వహించారు.

 వైభవంగా మారెమ్మ జాతర
గంగాజలం తెస్తున్న భక్తులు

బొమ్మనహాళ్‌, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి) మండలంలోని ఉప్పరహాళ్‌క్రా్‌సలో మారెమ్మ జాతరను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో మంగళవారం నిర్వహించారు. మారెమ్మ దేవతను ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం ఉద్దేహళ్‌ వేదావతి హగరి నుంచి గంగాజలం తెచ్చి అమ్మవారిని అభిషేకించి పూజలు నిర్వహించారు. గ్రామ దేవతకు కుంభాలతో నైవేథ్యం సమర్పించారు. ఏటా భాద్రపద మాసంలో గ్రామ దేవత జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

Updated Date - Sep 09 , 2025 | 11:47 PM