Share News

ఐక్యత కోసం పాదయాత్ర

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:14 AM

సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా యూనిటీ మార్చ్‌ (ఐక్యత కోసం పాదయాత్ర) కార్యక్రమాన్ని పట్టణంలో మంగళవారం నిర్వహించారు.

ఐక్యత కోసం పాదయాత్ర
పాదయాత్రలో పాల్గొన్న విద్యార్థులు, పుర ప్రముఖులు

గుంతకల్లుటౌన, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా యూనిటీ మార్చ్‌ (ఐక్యత కోసం పాదయాత్ర) కార్యక్రమాన్ని పట్టణంలో మంగళవారం నిర్వహించారు. ముందుగా దేశ ఐక్యత సాంస్కృతిక సాంప్రదాయాలను గుర్తు చేస్తూ విద్యార్థినులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పాదయాత్రను టీడీపీ ఇన్చార్జి గుమ్మనూరు నారాయణ స్వామి ప్రారంభించారు. ఇందులో ఆ నలుగురు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంజుల వెంకటేష్‌, శ్రీ శంకరానంద గిరిస్వామి డిగ్రీ కళాశాల, ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్యాడెట్లు, విద్యార్థులు, నారాయణ జూనియన కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 12:14 AM