కసాపురంలో మన్యుసూక్త హోమం
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:01 AM
కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం లో ఆదివారం పూర్వభాద్ర తిరునక్షత్రము సందర్భంగా మన్యుసూక్త హో మం నిర్వహించారు.
గుంతకల్లుటౌన, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం లో ఆదివారం పూర్వభాద్ర తిరునక్షత్రము సందర్భంగా మన్యుసూక్త హో మం నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి.. వేదపండితులు, అర్చకులు ఉత్సవ మూర్తికి తిరుమంజన స్నపన, మన్యుసూక్త హోమం, పూర్ణాహుతి నిర్వహించారు.