స్వచ్ఛందంగా పలువురి రక్తదానం
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:47 PM
స్థానిక సీహెచసీ ఆసుపత్రిలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని సోమవారం నిర్వహించారు.
ఉరవకొండ,సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): స్థానిక సీహెచసీ ఆసుపత్రిలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. టీడీపీ నాయకులు ప్యారంకేశవానంద, గోవిందు, ఎనఎ్‌సఎ్‌స విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన విద్యార్థులకు ప్రశంశాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆదినారాయణ, ఆసుపత్రి సూపరెంటెండెంట్ వెంకటస్వామి చౌదరి, పరమేష్, సుధాకర్ పాల్గొన్నారు.