Share News

launched ‘మాణికమ్మ శతకం’ ఆవిష్కరణ

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:27 PM

స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడు మాణిక్యం ఇసాక్‌ రచించిన మాణికమ్మ శతకం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని అదే పాఠశాలలో ఆదివారం నిర్వహించారు.

launched ‘మాణికమ్మ శతకం’ ఆవిష్కరణ
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డీఈఓ

బుక్కపట్నం, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడు మాణిక్యం ఇసాక్‌ రచించిన మాణికమ్మ శతకం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని అదే పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. ఇందులో డీఈఓ క్రిష్టప్ప, ఆపాస్‌ జిల్లా అధ్యక్షుడు అమర చంద్రబాబు మాట్లాడుతూ.. మంచి రచనలతోనే మానవత్వం విలువలు పెంపు సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బావనప్రియ సాహితీ అధ్యక్షుడు చక్రవర్తి, చత్రపతి సాహితీ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు రాయపాటి శివయ్య, ప్రధానోపాధ్యాయులు జగదీష్‌, జనార్ధన, నరసింహయ్యగుప్త, విజయ్‌కుమార్‌, శ్రీనివాసులు, పీడీ నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:27 PM