గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:41 PM
స్థానిక హమాలీ కాలనీకి చెందిన శేఖర్ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఉరవకొండ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): స్థానిక హమాలీ కాలనీకి చెందిన శేఖర్ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మానసిక పరిస్థితి సరిగా లేని ఇతను కుటుంబ సమస్యలతో విసిగిపోయాడు. మండలంలోని బూదగవి సమీపంలోని పొలంలో గురువారం ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీఐ మహానంది తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో శేఖర్ ఆసుపత్రి నుంచి బయటకు పరుగులు తీశాడు. పోలీసులు స్థానికుల సాయంతో అతికష్టం మీద అతన్ని మళ్లీ ఆసుపత్రి తీసుకువచ్చి వైద్యం చేయించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు.