పోలీస్‌స్టేషనలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:09 AM
కంబదూరు గ్రామానికి చెందిన ప్రకాశ అక్కడి పోలీ్‌సస్టేషనలోనే ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం జరిగింది
కళ్యాణదుర్గం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): కంబదూరు గ్రామానికి చెందిన ప్రకాశ అక్కడి పోలీ్‌సస్టేషనలోనే ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం జరిగింది. కంబదూరుకి చెందిన ప్రకాశ వద్ద టెట్రా ప్యాకెట్లు దొరడంతో పోలీసులు సోమవారం అతడిని పట్టుకుని వచ్చారు. మంగళవారం స్టేషనకు ప్రకాశను పిలిపించారు. అంతలోనే ప్రకాశ స్టేషనలో ఉన్న కిచెన రూమ్‌లోకి వెళ్లి ఓ పదునైన కత్తిని తీసుకుని తన ఎడమ చేతిని కోసుకున్నాడు. దీన్ని గమనించిన ఓ కానిస్టేబుల్ సహచర పోలీస్ సిబ్బంది సాయంతో అతడిని కంబదూరు ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. అధిక రక్తస్రావం కావడంతో ప్రకాశ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఈ సంఘటనను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కళ్యాణదుర్గం రూరల్ సీఐ నీలకంఠేశ్వర్‌ను వివరణ కోరగా అరెస్టు చేస్తారని పోలీసులనే భయపెట్టడానికే ఇలా ఆత్మహత్యకు యత్నించాడన్నారు. ప్రకాశపై గతంలో కర్ణాటక మద్యం కేసులో 2 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.