Share News

కమ్మూరులో మలేరియా

ABN , Publish Date - Dec 11 , 2025 | 11:52 PM

మండలంలోని కమ్మూరుకు చెందిన లక్ష్మమ్మ జర్వంతో బాధపడుతూ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది

కమ్మూరులో మలేరియా
కమ్మూరులో రక్త నమూనాలను సేకరిస్తున్న వైద్య సిబ్బంది

కూడేరు, డిసెంబరు 11, (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కమ్మూరుకు చెందిన లక్ష్మమ్మ జర్వంతో బాధపడుతూ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు వైద్య పరీక్ష చేయగా.. మలేరియాగా నిర్ధారణ అయింది. దీంతో అప్రమతమైన మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి మద్దయ్య, సూపర్‌వైజర్లు శ్రీధర్‌మూర్తి, రవీంధ్ర, యశోద గురువారం ఆ గ్రామంలో పర్యటించారు. పలువురు గ్రామస్థుల నుంచి రక్త నమూనాలను సేకరించారు. దోమలుకు నిలయంగా మారిన ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Updated Date - Dec 11 , 2025 | 11:52 PM