లోకేశ పర్యటనను జయప్రదం చేయండి
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:36 AM
మంత్రి నారాలోకేశ పర్యటనను జయప్రదం చేయాలని టీడీపీ నాయకుడు ధర్మతేజ.. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కోరారు.
కళ్యాణదుర్గం, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): మంత్రి నారాలోకేశ పర్యటనను జయప్రదం చేయాలని టీడీపీ నాయకుడు ధర్మతేజ.. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కోరారు. బుధవారం శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి లోకేశ శుక్ర, శనివారాల్లో కళ్యాణదుర్గంలో పర్యటిస్తారని, ప్రజలందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నాయకులు, కార్యకర్తలతో మంత్రి సమావేశం, శనివారం కనకదాసు విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు భారీగా తరలిరావాలని కోరారు. అనంతరం ఆయన మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.