Assembly దళిత ద్రోహి జగన రెడ్డి: ఎంఎస్ రాజు
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:12 AM
వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు దళితులను అవమానించిన ద్రోహి జగన రెడ్డి అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిప డ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో దళితులకు గత ప్రభుత్వంలో జరిగిన అవమానాల గురించి సో మవారం ఆయన మాట్లాడారు.

మడకశిర టౌన, మార్చి 10(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు దళితులను అవమానించిన ద్రోహి జగన రెడ్డి అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిప డ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో దళితులకు గత ప్రభుత్వంలో జరిగిన అవమానాల గురించి సో మవారం ఆయన మాట్లాడారు. దళిత బిడ్డ బాల యోగిని చంద్రబాబు దేశంలో అత్యున్నతమైన పార్ల మెంట్ స్పీకర్‌ను చేశారని అన్నారు. అదే దేశం ముం దు దళితులను జగన అవమానపర్చారని అన్నారు. ఒ క దళితుడు డాక్టర్ వృ త్తిలో కొనసాగాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయని, అలాంటి డాక్టర్‌ను నడిరోడ్డుపై అవమానించి, ఆయన మృతికి జగన కారణం కాలేదా అని ప్రశ్నించారు. ఒక డ్రై వర్‌ను హత్యచేసి డోర్ డెలివరీ చేసినా.. బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్నారు. వెనకబడిన వర్గాలన్నా, దళితులన్నా జగనకు చిన్న చూపు అని అన్నారు.