బార్‌లకు లక్కీ డ్రా
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:59 PM
బార్ లైసెన్సలకు అధికారులు శనివారం లాటరీ తీశారు. జడ్పీ డీపీఆర్సీ భవనంలో అనంతపురం, పుట్టపర్తిలోని సాయి ఆరామంలో శ్రీసత్యసాయి జిల్లా లాటరీలను తీశారు. అనంతపురం జిల్లాలోని 10 ఓపెన కేటగిరీ బార్లకు 40 దరఖాస్తులు, గీత కులాల బార్లకు 10 దరఖాస్తులు వచ్చాయి.
దక్కించుకున్నవారికి ధ్రువపత్రాలు
అనంతపురం క్రైం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): బార్ లైసెన్సలకు అధికారులు శనివారం లాటరీ తీశారు. జడ్పీ డీపీఆర్సీ భవనంలో అనంతపురం, పుట్టపర్తిలోని సాయి ఆరామంలో శ్రీసత్యసాయి జిల్లా లాటరీలను తీశారు. అనంతపురం జిల్లాలోని 10 ఓపెన కేటగిరీ బార్లకు 40 దరఖాస్తులు, గీత కులాల బార్లకు 10 దరఖాస్తులు వచ్చాయి. అసిస్టెంట్ కలెక్టర్ సచిన రహర్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామ్మోహనరెడ్డి ఆధ్వర్యంలో డ్రా తీశారు. ఎంపికైనవారికి ధ్రువీకరణ పత్రాలను అందించారు. కార్యక్రమంలో ఇనస్పెక్టర్లు సత్యనారాయణ, నాయుడు, శివసాగర్, ఇనఫోర్స్‌మెంట్ సీఐ జయనాథరెడ్డి, ఎస్‌ఐలు జయనరసింహ, జాకీర్‌హుస్సేన, కృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో 12 బార్‌లకు దరఖాస్తులు ఆహ్వానించగా, ఏడింటికే దరఖాస్తులు వచ్చాయి. సాయి ఆరామంలో కలెక్టర్ టీఎస్ చేతన లాటరీ తీశారు. హిందూపురంలో గీత కులాలకు కేటాయించిన బార్‌తో కలిపి మూడు బార్లు, కదిరిలో రెండు, ధర్మవరం, పెనుకొండ మున్సిపాలిటీల్లో ఒక్కో బార్‌కు లాటరీ తీశారు. లైసెన్స దక్కించుకున్నవారికి ఎక్సైజ్ శాఖ అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ గోవిందునాయక్, ఏఈఎస్ నరసింహులు పాల్గొన్నారు.