Share News

వైసీపీ అక్రమ కేసుతో ఉద్యోగం పోయింది

ABN , Publish Date - Sep 30 , 2025 | 12:35 AM

వైసీపీ నాయకులు తనపై అక్రమ కేసు బనాయించి.. తన ఉద్యోగం పోయేలా చేశారని, తనకు న్యాయం చేయాలని మండలంలోని కొలిమిపాలెం అంగనవాడీ టీచర్‌ రాజేశ్వరి ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సోమవారం కలెక్టర్‌ ఆనంద్‌ వద్ద వాపోయారు

వైసీపీ అక్రమ కేసుతో ఉద్యోగం పోయింది
కలెక్టరేట్‌లో అంగనవాడీ టీచర్‌ రాజేశ్వరి నిరీక్షణ

కుందుర్పి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు తనపై అక్రమ కేసు బనాయించి.. తన ఉద్యోగం పోయేలా చేశారని, తనకు న్యాయం చేయాలని మండలంలోని కొలిమిపాలెం అంగనవాడీ టీచర్‌ రాజేశ్వరి ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సోమవారం కలెక్టర్‌ ఆనంద్‌ వద్ద వాపోయారు. ఆమె మాట్లాడుతూ... ‘నేను కొలిమిపాలెంలో అంగనవాడీ టీచర్‌ను. నేను, నా భర్త కిరాణా కొట్టు నిర్వహిస్తున్నాం. మా కుటుంబ సభ్యులు టీడీపీ వారు కావడంతో గ్రామంలోని వైసీపీ నాయకులు నాపై కుట్ర పన్నారు. మా కొట్టులో గుట్కాలు, మద్యం, టెట్రా ప్యాకెట్లు ఉంచి.. నాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌ఐ గణే్‌షపై వాళ్లు ఒత్తిడి తెచ్చి అక్రమ కేసు బనాయించి.. నా ఉద్యోగం పోయే లా చేశారు. ఈ విషయంలో నాకు న్యాయం చేయాలని గతంలో ఎస్పీ వద్ద మొరపెట్టుకున్నా. అయినా ఫలితం లేదు. కలెక్టరైనా స్పందించి నాకు న్యాయం చేయాలి.. ’ అని రాజేశ్వరి కలెక్టర్‌ను కోరినట్లు తెలిపింది.

Updated Date - Sep 30 , 2025 | 12:35 AM