అంజన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:41 AM
శ్రావణమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి.
పెనుకొండ, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): శ్రావణమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఊరువాకిలి ఆంజనేయస్వామి, వజ్రముష్టి ఆంజనేయస్వామి, దక్షిణముఖ ఆంజనేయస్వామి, మిట్ట ఆంజనేయస్వామి ఆలయంతోపాటు కాశీ విశ్వేశ్వరస్వామి, ఐముక్తేశ్వరస్వామి, ఘనగిరి సోమేశ్వరాలలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చకులు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాల వినియోగం జరిగింది.