Share News

Loans వడ్డీతోనే రుణాలు రెన్యువల్‌ చేయాలి

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:57 AM

వ్యవసాయ రుణాలను కేవలం వడ్డీ కట్టించుకోని రెన్యువల్‌ చేయాలని రైతులు, రైతు సంఘం, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు

Loans వడ్డీతోనే రుణాలు రెన్యువల్‌ చేయాలి
బ్యాంక్‌ ఎదుట ధర్నా చేస్తున్న రైతులు, నాయకులు


తనకల్లు, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రుణాలను కేవలం వడ్డీ కట్టించుకోని రెన్యువల్‌ చేయాలని రైతులు, రైతు సంఘం, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఈ మేరకు మండలంలోని కొక్కంటి క్రాస్‌లో ఉన్న యూనియన బ్యాంక్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రైతులు కరువుతో, పంటలు పండక ఇబ్బందులు పడుతుంటే బ్యాంక్‌ అధికారులు పంటరుణాల రెన్యువల్‌ విషయంలో వడ్డీ, అసలు కట్టాలని డిమాండ్‌ చేయడం సరికాదన్నారు. అనంతరం వినతిపత్రాన్ని మేనేజర్‌ నాయక్‌కు అందచేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం రమణ, వెంకట రమణ, శివన్న, సీపీఐ రెడ్డెప్ప, కాంగ్రెస్‌ పారేసు, సీపీఎం రమణ, శివన్న, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:57 AM