వలసలో ముగిసిన బతుకులు
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:24 AM
కడప జిల్లా జమ్మలమడుగు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రొద్దం మండలం కంచిసముద్రం గ్రామానికి చెందిన వడ్డె ఆంజనేయులు(25), శ్యాపురం గ్రామానికి చెందిన శివకుమార్ యాదవ్(25) మృతిచెందారు.
జమ్మలమడుగు వద్ద బైక్‌ను ఢీకొట్టిన కారు
ఇద్దరు రొద్దం మండల కూలీలు మృతి
రొద్దం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా జమ్మలమడుగు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రొద్దం మండలం కంచిసముద్రం గ్రామానికి చెందిన వడ్డె ఆంజనేయులు(25), శ్యాపురం గ్రామానికి చెందిన శివకుమార్ యాదవ్(25) మృతిచెందారు. హంద్రీనీవా కాలువ పనులు చేసేందుకు వీరు కూలీలుగా వెళ్లారు. పని ప్రదేశం వద్ద భోజనం చేయడానికి మంచినీరు లేకపోవడంతో తెచ్చుకునేందుకు బైక్‌పై బయలుదేరారు. ప్రధాన రహదారిపైకి బైక్ ఎక్కే సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను బుధవారం రాత్రి స్వగ్రామాలకు తీసుకువచ్చారు. పెనుకొండలో మంత్రి సవిత వారికి నివాళులు అర్పించారు. అంత్యక్రియల కోసం బాధిత కుటుంబాలకు నగదు సాయం అందించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆంజనేయులు భార్య మమత మూడు నెలల గర్భిణి. వీరికి మూడేళ్ల కూతురు ఉంది. ఈ ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. మృతులవి పేద కుటుంబాలని, ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు విన్నవించారు.
గుమ్మఘట్ట: మద్యం మత్తులో బైకు నడుపుతూ గోనబావి గ్రామానికి చెందిన తిమ్మప్ప(50) ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. అతివేగంగా వెళుతూ గణేష్ అనే యువకుడిని బైక్‌తో ఢీకొట్టి.. తిమ్మప్ప కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన గణే ్‌ష ను రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
తాడిపత్రి: పట్టణంలోని టైలర్స్ కాలనీ సమీపంలో బుధవారం రాత్రి పంది అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి శామ్యూల్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం అనంతపురానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడని హెడ్ కానిస్టేబుల్ వెంకటరాముడు తెలిపారు. నందలపాడుకు చెందిన శామ్యూల్ స్టీల్‌ప్లాంట్ కార్మికుడు. పుట్లూరు రోడ్డులోని ఓ ఫంక్షన హాలులో తన స్నేహితుడి కొడుకు పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆయన భార్య రాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ధర్మవరం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని దుర్గానగర్‌కు చెందిన అక్కం సతీశకుమార్(36) బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు టూటౌన సీఐ రెడ్డప్ప తెలిపారు. ఆయన తెలిపిన మేరకు... అక్కం సతీశకుమార్, అతడి భార్య కవిత చేనేత కార్మికులు అయితే బుధవారం రాత్రి 8-45 గంటలకు భోజనం చేయడానికి సిద్ధమవుతుండగా ఫోన రావడంతో ద్విచక్రవాహనంపై అక్కం సతీశకుమార్ బయటకు వెళ్లాడు. అదే సమయంలో అతడి తమ్ముడు అనిల్‌కుమార్ ఇంటి వద్దకు వచ్చాడు. సోదరుడు బయట ఉన్నాడని తెలుసుకుని ఫోన చేసి పెట్రోల్ తీసుకుని రమ్మన్నాడు. సతీశ కుమార్ పెట్రోల్ తీసుకుని వస్తూ టూటౌన పోలీ్‌సస్టేషన ఎదురుగా ఉన్న చికెన సెంటర్ మలుపు వద్ద బైకును అదుపు చేయలేక కిందకు పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
హిందూపురం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన హిందూపురం మండలం లో గురువారం రాత్రి జరిగింది. ద్విచక్రవాహనంపై హిందూపురం వస్తుండగా గౌరీబిదనూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనంపై వస్తున్న యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు పట్టణంలోని యర్రకొట్టాల ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ధర్మవరం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): విద్యుతషాక్‌తో గాయపడి, అస్పత్రిలో పొందుతున్న బాలిక బుధవారం సాయంత్రం మృతి చెందింది. టూటౌన సీఐ రెడ్డప్ప తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పుణుగుడు గ్రామానికి చెందిన పొట్లూరు శ్రీహరి, రేష్మ దంపతుల పెద్దకుమార్తె వెంకటేశ్వరి(10), కుమారుడు భరతకుమార్, చిన్నకుమార్తె రమ్యతో కలిసి పట్టణానికి మూడు నెలలక్రితం వలస వచ్చారు. శారదానగర్‌లో ఉంటున్నారు. శ్రీహరి బేల్దారి పనులకు వెళ్తుండేవాడు. గతనెల 14వ తేదీన చంద్రబాబునగర్‌లో మాయకుంట్ల జయచంద్రకు చెందిన ఇంటి నిర్మాణ పనులు చే స్తున్న సమయంలో పెద్ద కుమార్తె వెంకటేశ్వరి కూడా తల్లిదండ్రులతో పాటు వెళ్లింది. బాలిక మిద్దెపైన ఆడుకుంటూ 11 కేవీ విద్యుత వైర్లకు ప్రమాదవశాత్తు తగలడంతో కిందపడి గాయపడింది. వెంటనే తల్లిదండ్రులు.. బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం, అక్కడి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈనెల 24వ తేదీన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తుండగా బుఽధవారం చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు గురువారం ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.