Chaudeshwari Devi ఘనంగా చౌడేశ్వరీదేవికి జ్యోతులు
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:34 PM
అమడగూరులో చౌడేశ్వరీ దేవి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): అమడగూరులో చౌడేశ్వరీ దేవి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవ రథ పల్లకిని పలురకాల పుష్పాలు, విద్యుత దీపాలతో అలంకరించారు. మాజీ జడ్పీటీసీ పొట్టా పురుషోత్తమరెడ్డి రథోత్సవాన్ని ఆలయం వద్ద ప్రారంభించారు. జ్యోతికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పుణ్యహవచనం, శాంతి పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతిని ఎత్తుకుని అమ్మవారి రథం ముందు ఊరేగింపును ఆలయం వరకు నిర్వహించారు. ఈ ఉత్సవానికి మండల ప్రజలేకాక కర్ణాటక భక్తులూ అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాత్రి నిర్వహించిన ఆర్కెసా్ట్ర, సంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.