స్వచ్ఛ రాయదుర్గం కోసం పనిచేద్దాం: విప్
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:56 PM
పట్టణా న్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా విధులు నిర్వహించాలని మున్సిపల్ కార్మికులకు విప్ కాలవ శ్రీనివాసులు సూచించారు.
రాయదుర్గం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): పట్టణా న్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా విధులు నిర్వహించాలని మున్సిపల్ కార్మికులకు విప్ కాలవ శ్రీనివాసులు సూచించారు. పట్టణంలో అపరిశుభ్రతపై ఇటీవల పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో మంగళవారం ఉదయాన్నే ఆయన మున్సిపల్ పారిశుధ్య కార్మికులను కలిశారు. విదులను అందరూ సక్రమంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం చేస్తే అధికారులకు, పాలకులకూ చెడ్డ పేరు వస్తుందని అన్నారు. రాయదుర్గంలో తగిన మంది కార్మికులు లేరని, దీంతో తమపై పనిభారం అధికమవుతోందని పలువురు కార్మికులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. ఈ విషయాన్ని పురపాలక శాఖమంత్రికి చెప్పి మరికొంతమందిని నియమించేలా కృషి చేస్తానన్నారు.