Share News

స్వదేశీ ఉత్పత్తులనే వినియోగిద్దాం

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:30 AM

స్వదేశీ చేతివృత్తిదారుల ఉత్పత్తులనే అందరూ వినియోగించి.. వారిని ప్రోత్సహించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంకాల్‌రెడ్డి సూచించారు

స్వదేశీ ఉత్పత్తులనే వినియోగిద్దాం
స్టిక్కర్‌ను విడుదల చేస్తున్న బీజేపీ నాయకులు

యాడికి, నవంబరు10(ఆంధ్రజ్యోతి): స్వదేశీ చేతివృత్తిదారుల ఉత్పత్తులనే అందరూ వినియోగించి.. వారిని ప్రోత్సహించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంకాల్‌రెడ్డి సూచించారు. సోమవారం యాడికిలో బీజేపీ నాయకులు ఆత్మనిర్బర్‌ భారత కార్యక్రమాన్ని ని ర్వహించారు. స్వదేశీ ఉత్పత్తులని ప్రతి ఒక్కరూ వినియోగించడం వల్ల మనదేశ ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చెందుతుందన్నారు. వికసిత భారత సంకల్పంలో భాగంగా ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. స్వదేశీ వస్తువులను వినియోగించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర లీగ ల్‌ సెల్‌ కన్వీనర్‌ ప్రతా్‌పరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆంజనేయులు, శేషానందరెడ్డి, రంగనాయకులు మండల కన్వీనర్‌ రాజశేఖర్‌, నాయకులు గంగాధర్‌, చౌడయ్య, జగదీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 01:30 AM