Share News

బాల్య వివాహాలను అరికడదాం

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:12 AM

బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ న్యాయాధికారి రాజశేఖర్‌ పేర్కొన్నారు

బాల్య వివాహాలను అరికడదాం
పోస్టర్‌ను విడుదల చేస్తున్న న్యాయాధికారి

కూడేరు, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ న్యాయాధికారి రాజశేఖర్‌ పేర్కొన్నారు. శుక్రవారం కూడేరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందుకు సంబందించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ లాయర్లు మహేష్‌, అనుష విజయదుర్గ, ఆర్‌ఎంహెచఓ హేమలత, ట్రైబల్‌ వెల్పేర్‌ సూపరింటెండెంట్‌ సురేష్‌, ఎంపీడీఓ కుళ్లాయిస్వామి, ఎం ఈఓ మహమ్మద్‌ గౌస్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 12:12 AM