Share News

తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటుదాం

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:28 AM

తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆల్‌ ఇండియా రేడియో సీనియర్‌ వ్యాఖ్యాత జిగర్లపూడి శ్యామసుందర శాసి్త్ర పిలుపునిచ్చారు.

తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటుదాం
మాట్లాడుతున్న తెలుగు వ్యాఖ్యాత శ్యాంసుందర్‌ శాసి్త్ర

కుందుర్పి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆల్‌ ఇండియా రేడియో సీనియర్‌ వ్యాఖ్యాత జిగర్లపూడి శ్యామసుందర శాసి్త్ర పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఆవరణంలో తెలుగు భాష దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా శాసి్త్రతో పాటు అష్టావధాని గురివేపాలి నరసింహులు హాజరయ్యారు. ముందుగా గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారు తెలుగు భాష గొప్పతనం, సాంప్రదాయాలు, అలవాట్లను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు గోపి, తెలుగు భాష గేయకుడు మహేందర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 12:28 AM