Share News

dmho తల్లీబిడ్డను కాపాడుకుందాం

ABN , Publish Date - May 19 , 2025 | 11:34 PM

సమష్టిగా పని చేసి తల్లీబిడ్డను కాపాడుకుందామని డీఎంహెచఓ డాక్టర్‌ ఫైరోజ్‌బేగం పేర్కొన్నారు. స్థానిక డీఎంహెచఓ కార్యాలయంలో మాతాశిశుమరణాలపై జిల్లాస్థాయి సమీక్షాసమాశాన్ని సోమవారం నిర్వహించారు

dmho తల్లీబిడ్డను కాపాడుకుందాం
మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి ఫైరోజ్‌బేగం

పుట్టపర్తిరూరల్‌, మే 19 (ఆంద్రజ్యోతి): సమష్టిగా పని చేసి తల్లీబిడ్డను కాపాడుకుందామని డీఎంహెచఓ డాక్టర్‌ ఫైరోజ్‌బేగం పేర్కొన్నారు. స్థానిక డీఎంహెచఓ కార్యాలయంలో మాతాశిశుమరణాలపై జిల్లాస్థాయి సమీక్షాసమాశాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లాలో వివిధ ఆసుపత్రులలో ఏప్రిల్‌ నెలలో సంభవించిన ఆరు శిశుమరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. లోపాలను సరిచేసుకుని సమష్టిగా పని చేసినట్లయితే తల్లీబిడ్డలను కాపాడుకోవచ్చన్నారు. ప్రతినెలా తొమ్మిదో తేదీన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో జరిగే ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన సందర్భంగా గర్భిణులకు గ్రూపు సమావేశం నిర్వహించి ఆరోగ్య విద్య అందించాలన్నారు. హైరిస్క్‌ గర్భవతులకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని, పర్యవేక్షక సిబ్బందితో కాన్పు అయ్యేంత వరకు వారిపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్‌ శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ డీఎంహెచఓలు డాక్టర్‌ నాగేంద్రనాయక్‌, డాక్టర్‌ సునీల్‌, డీసీహెచఎ్‌స తిప్పేంద్రనాయక్‌, డాక్టర్‌ నేహా తబుసుం, డాక్టర్‌ వెం కటేశ్వర్లు, డాక్టర్‌ కార్తీక్‌, ఐసీడీఎస్‌ సీడీపీఓ గాయత్రి పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2025 | 11:34 PM