Share News

హైందవధర్మాన్ని కాపాడుకుందాం

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:21 AM

హైందన సనాతన ధర్మాని కాపాడుకోవడం ప్రతి హిందు వు కనీస ధర్మమని, ఐకమత్యంతో దాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని అంబాత్రయ క్షేత్రం పిఠాధిపతి ఆదిత్య పరాశ్రీ స్వామి సూచించారు.

 హైందవధర్మాన్ని కాపాడుకుందాం
పామిడిలో మాట్లాడుతున్న అంబాత్రయ క్షేత్రం పీఠాధిపతి ఆదిత్య పరాశ్రీ స్వామి

పామిడి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): హైందన సనాతన ధర్మాని కాపాడుకోవడం ప్రతి హిందు వు కనీస ధర్మమని, ఐకమత్యంతో దాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని అంబాత్రయ క్షేత్రం పిఠాధిపతి ఆదిత్య పరాశ్రీ స్వామి సూచించారు.ప్రపంచానికి శాంతిని భోధించిన హైందవ సనాతన ధర్మం.. వీరత్వాన్ని కూడా రుచి చూపించిందన్నారు. స్థానిక సరస్వతీ విద్యా మం దిరం ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనం సభలో ఆయన మా ట్లాడారు. హైందవ ధర్మం జోలికి వస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఇటీవల నిర్వహించిన మహాకుంభమేళలో లక్షలాది మంది సన్యాసులు, సిద్ధు లు, మునులు పాల్గొన్నారని, హద్దులు మీరితే హైందవ ధర్మాన్ని కాపాడేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని, తాము ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. పాకిస్థాన, బంగ్లాదేశలో జరుగుతున్న హిందూవులపై దాడులను ప్రతి హిందువూ వ్యతిరేకించాలని, దీన్ని కోల్పొతే మన సంపదలను సైతం కొల్లగొడుతారని హె చ్చరించారు. అనంతరం తెలుగు ఉపాధ్యాయుడు జూటూరు తులసీదాస్‌ రచించిన కాకు లు దూరని కారడవి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం నుంచి సభవరకూ హిందూవులు కోలాటం, భక్తిగీతాలాపనలతో ర్యాలీ చేపట్టారు.

Updated Date - Dec 22 , 2025 | 12:21 AM