సీఎం సభను విజయవంతం చేద్దాం : విప్
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:40 PM
అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం నిర్వహించే సూపర్‌సిక్స్ సూపర్ హిట్ విజయవంతం సభను జయప్రదం చేయాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు
రాయదుర్గం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం నిర్వహించే సూపర్‌సిక్స్ సూపర్ హిట్ విజయవంతం సభను జయప్రదం చేయాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సీతారామాంజనేయ కళ్యాణమంటపంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథులుగా విప్‌తో పాటు పరిశీలకులు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సూపర్‌సిక్స్ సక్సెస్ సభకు అంచనాకు మించి తరలిరావాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి మద్దతుదారులే అన్ని పంచాయతీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులుగా గెలవాలన్నారు. కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన డైరెక్టర్ పొరాళు పురుషోత్తం, మార్కెట్ యార్డు ఛైర్మన హనుమంతరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు, టంకశాల హనుమంతు పాల్గొన్నారు.