సీఎం సభను విజయవంతం చేద్దాం
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:26 AM
అనంతపురంలో బుధవారం నిర్వహించే సూపర్ సిక్స్ .. సూపర్ హిట్.. విజయోత్సవసభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ పాల్గొంటున్నారని, అధిక సంఖ్యలో ప్రజలు, అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు
కళ్యాణదుర్గం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): అనంతపురంలో బుధవారం నిర్వహించే సూపర్ సిక్స్ .. సూపర్ హిట్.. విజయోత్సవసభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ పాల్గొంటున్నారని, అధిక సంఖ్యలో ప్రజలు, అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు. స్థానిక ప్రజావేదిక వద్ద కూటమి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన భార సమావేశంలో ఆయన మాట్లాడారు. మన నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో తరలివెస్తే.. అభివృద్ధికి అవసరమైన నిధులు అడిగేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ఈ భారీ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొంటున్నారని, ఈసభను విజయవంతం చేసే దిశగా ప్రతి గ్రామం నుంచి జనం భారీగా తరలిరావాలని అన్నారు.