mla పుట్టపర్తికి పూర్వవైభవం తెద్దాం
ABN , Publish Date - May 01 , 2025 | 11:45 PM
పుట్టపర్తికి పూర్వవైభవం తెచ్చేలా అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి సూచించారు.
పుట్టపర్తిరూరల్, మే 1(ఆంధ్రజ్యోతి): పుట్టపర్తికి పూర్వవైభవం తెచ్చేలా అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి సూచించారు. సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలు, పుట్టపర్తి అభివృద్ధి, చిత్రావతి సుందరీకరణ పనులు .. తదితర వాటిపై ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రూ. 105 కోట్లతో చిత్రావతి రోడ్డు విస్తరణ, చిత్రావతి సుందరీకరణ.. తదితర అభివృద్ధి పనులన్నీ నవంబర్‌లో జరిగే బాబా జయంతి ఉత్సవాల నాటికి పూర్తీ చేయాలన్నారు. పట్టణంలో సోలార్ లైట్ల ఏర్పాటు, బుక్కపట్నం చెరువు నుంచి చిత్రావతి చెక్‌డ్యాం నింపడానికి రూ. 3 కోట్లతో ఎత్తిపోతల పథకం అమలుకు ప్రతిపాదనలు పంపాలని ఆయా శాఖల ఆధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్కిటెక్ ఇంజనీర్ గణేష్, టూరిజం జిల్లా అధికారి నరసయ్య, ఇరిగేషన ఎస్‌ఈ విశ్వనాథరెడ్డి, డీఈ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద, ఆర్‌డబ్ల్యూఎస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే అధికారులతో కలసి చిత్రావతి నది చెక్‌డ్యాం హారతిఘాట్ నదీ పరీవాహక ప్రాంతాలను పరిశీలించారు.