Land subdivision 30వరకు భూముల సబ్‌డివిజన డ్రైవ్
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:27 PM
భూములు రీసర్వే జరిగిన గ్రామాల్లో ఈనెల 30వరకు సబ్ డివిజన డ్రైవ్ ఉంటుందని తహసీల్దార్ ప్రతా్‌పరెడ్డి తెలిపారు.
యాడికి, జూన 26(ఆంధ్రజ్యోతి): భూములు రీసర్వే జరిగిన గ్రామాల్లో ఈనెల 30వరకు సబ్ డివిజన డ్రైవ్ ఉంటుందని తహసీల్దార్ ప్రతా్‌పరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాయింట్ పట్టాదారులుగా ఉన్న రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని, దీంతో ఈ ఇబ్బందులను తొలగించడానికి ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమస్య ఉన్న రైతులు దరఖాస్తు రుసుం రూ.50 సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్‌కు చెల్లించాలని, జాయింట్ పట్టాదారులకు ఉచితంగానే సబ్ డివిజన చేస్తారని తెలిపారు. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో రీసర్వే డిప్యూటి తహసీల్దార్ విజయ్‌కుమార్, మండల సర్వేయర్ శేషసాయి పాల్గొన్నారు.