land భూ వివాదాలు గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:21 AM
భూవివాదాలను రెవెన్యూ అధికారులు నిర్ధిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో రెవెన్యూ సేవలపై శుక్రవారం జేసీ అభిషేక్‌కుమార్‌తో కలిసి జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో సమీక్షించారు.

పుట్టపర్తి టౌన, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): భూవివాదాలను రెవెన్యూ అధికారులు నిర్ధిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో రెవెన్యూ సేవలపై శుక్రవారం జేసీ అభిషేక్‌కుమార్‌తో కలిసి జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ కమిషన, లోకాయుక్త, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కారానికి కృషి చేయాలన్నారు. భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలిచ్చిన అర్జీలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంతృప్తి సమాధానాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు సువర్ణ, మహేష్, వీవీఎస్ శర్మ, ఆనంద్, ల్యాండ్ సర్వే జిల్లా అధికారి విజయశాంతిబాయి, జిల్లాలోని తహసీల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.