Share News

భూమి కేటాయింపును రద్దు చేయాలి

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:33 AM

రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ ప్రాజెక్టులకు భూమిని కేటాయించే విధానాన్ని రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి పేర్కొన్నారు.

భూమి కేటాయింపును రద్దు చేయాలి
మాట్లాడుతున్న ప్రభాకర్‌ రెడ్డి

గుత్తి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ ప్రాజెక్టులకు భూమిని కేటాయించే విధానాన్ని రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. స్ధానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లు లీజు ఒప్పందం వల్ల రైతు దీర్ఘ కాలంలో భూమి మీద హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. లీజు ఒప్పందం పది సంవత్సరాలు దాటకుండా ఉండాలని, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కౌలు 30 శాతం అదనంగా కలిపి ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ రెడ్డి, జిల్లానాయకులు దస్తగిరి, ఈశ్వర్‌రెడ్డి, కేవీపీఎస్‌ మండల కార్యదర్శి మల్లికార్జున, సీపీఎం మండల కార్యదర్శి నిర్మల, నాయకులు మల్లేష్‌, రేణుకమ్మ పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 12:33 AM