Pennahobilam పెన్నహోబిలంలో సౌకర్యాల లేమి..!
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:09 AM
మండలంలోని పెన్నహో బిలం లో పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఉరవకొండ, జూన 4(ఆంద్రజ్యోతి): మండలంలోని పెన్నహో బిలం లో పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రమిది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక నుంచి భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. శని, ఆదివారాల్లో వందల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఆలయ, పరిసర ప్రాంతాలన్నీ కనువిందుచేస్తున్నాయి. ఆ ప్రాంతంలో పర్యాటకులు కుటుంబసభ్యులతో వచ్చి సేదతీరి, ఆనందంగా గడుపుతూ ఉంటారు. జలపాతం వద్ద గతంలో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బెంచీలన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో కనీసం కూర్చోవడానికి వీలులేకుండా పోయింది. పెన్నహోబిలంలో తిష్ట వేసిన సమస్యలు పరిష్కరించడంపై.. అభివృద్ధిపైన ఆలయ అధికారులు దృష్టిసారించడం లేదని విమర్శలున్నాయి. హెచ్చెల్సీకి నీరు వచ్చినపుడు జలపాతం చూడడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. జలపాతం నీరు కిందకు పడే చోట రక్షణ గోడ ధ్వంసమై రెండేళ్లయింది. ఈ విషయంపై ఈఓ రమే్‌షను వివరణ కోరగా... పెన్నహోబిలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన తయారు చేస్తున్నామని, భక్తులకు, పర్యాటకులకు తగిన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.