జగనన్న కాలనీలో సౌకర్యాల లేమి
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:29 AM
స్థానిక జగనన్న కాలనీలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఆ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
కూడేరు, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): స్థానిక జగనన్న కాలనీలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఆ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం-బళ్లారి ప్రధాన పక్కనే వైసీపీ పాలనలో జగనన్న కాలనీలో దాదాపు 45 మందికి ప్లాట్లు మంజూరు చేశారు. ఇందులో తొమ్మిది మంది మాత్రమే ఇంటి నిర్మాణపు పనులు పూర్తి చేశారు. మిగిలిన ప్లాట్లలో కొన్ని ఇళ్లు అసంపూర్తిగా ఉండగా.. మరిన్ని పునాదులకే పరిమితమయ్యాయి. కాలనీలో వీధి దీపాలు, సీసీ రోడ్లు తదితర కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇళ్లు కట్టుకోవడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆ కాలనీ వాసులు వాపోతున్నారు. అధికారులు స్పందించి కాలనీలో వీధి దీపాలు, సీసీ రోడ్లు తదితరు సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.