తరగతి గదుల కొరత
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:19 AM
మండలంలో చదంగొల్లలదొడ్డి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఈ సంవత్సరం పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేశారు. అయితే అందుకు తగ్గ సౌకర్యాలను కల్పించడంపై అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చూపారు.
రాయదుర్గం రూరల్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): మండలంలో చదంగొల్లలదొడ్డి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఈ సంవత్సరం పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేశారు. అయితే అందుకు తగ్గ సౌకర్యాలను కల్పించడంపై అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చూపారు. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 478 మంది విద్యార్థులు ఉన్నారు. 18 గదులు అవసరం కాగా.. కేవలం నాలుగు గదులే ఉన్నాయి. గదుల కొరతతో చెట్ల కింద, వరండాలో తరగతులను నిర్వహిస్తున్నారు. దీంతో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే ఇక పరిస్థితి మరీ ఘోరం. గదుల సమస్య పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై హెచఎం వెంకటరమణను వివరణ కోరగా.. ప్రభుత్వం అదనపు గదులను నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.