భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:13 AM
స్ధానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో అవోపా వినాయక ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో మహాగణపతి సహస్ర కుంకుమార్చన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
గుంతకల్లుటౌన, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): స్ధానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో అవోపా వినాయక ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో మహాగణపతి సహస్ర కుంకుమార్చన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. వెండి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య గాయని వాసవి సిస్టర్స్ దిదేషిమణి, పామిడి నాగమణి మనోహర్, ఆ సమితి అధ్యక్షుడు ఇనుగూరు శంకర్‌నారాయణ, సెక్రెటరీ పువ్వాడి శ్రీనివాసులు, కోశాధికారి ఎస్‌ఎంకే లక్ష్మీనారాయణ, సలహాదారు మిట్లా లోకేంద్రనాథ్; జయంతివెంకట్, ఇనుగూరు సుబ్బయ్య పాల్గొన్నారు.