ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:07 AM
పట్టణంలో త్రైత సిద్దాంత ప్రభోద సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
గుత్తి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): పట్టణంలో త్రైత సిద్దాంత ప్రభోద సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కృష్ణుడి ప్రతిమను కొలువుదీర్చి 11రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీకృష్ణ ప్రతిమను ఊరేగించారు.