Krishna Water కృష్ణమ్మ నింపింది ఆనందం
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:02 AM
కృష్ణమ్మ రాకతో మడకశిర ప్రాంతం పులకించిపోతోంది. హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చిన కృష్ణా జలాలతో మండలంలోని మణూరు చెరువు నిండడంతో సోమవారం సంబరాలు చేసుకున్నారు.
మడకశిర రూరల్, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): కృష్ణమ్మ రాకతో మడకశిర ప్రాంతం పులకించిపోతోంది. హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చిన కృష్ణా జలాలతో మండలంలోని మణూరు చెరువు నిండడంతో సోమవారం సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి.. కృష్ణా జలాలకు హారతి ఇచ్చారు. బోటులో చెరువులో విహరించారు. అనంతరం వారు.. రైతులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ చిత్రపటాలతో చెరువులోకి దిగి, ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో హంద్రీనీవా కాలువలు నిర్వీర్యం చేశారన్నారు. కాలువల్లో మరమ్మతులు పూర్తి చేసి, చివరి నియోజకవర్గాలకు కూడా నీరివ్వడం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అన్నారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపిన తర్వాత సీఎం వచ్చి జలహారతి ఇస్తారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, రాష్ట్ర ఒక్కలిగ కార్పొరేషన చైర్మన లక్ష్మీనారాయణ, మండల కన్వీనర్ నాగరాజు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.